‘‘ఏ విషయాన్నయినా బాగా పరిశీలించాలంటే ఏమి చెయ్యాలిరా బుజ్జి?’’ తల్లి అడిగింది. ‘‘కళ్ళజోడు పెట్టుకోవాలమ్మా’’. ----------------------...
‘‘ఏ విషయాన్నయినా బాగా పరిశీలించాలంటే
ఏమి చెయ్యాలిరా బుజ్జి?’’ తల్లి అడిగింది.
‘‘కళ్ళజోడు పెట్టుకోవాలమ్మా’’.
----------------------------------------
ప్రేక్షకుడు: నేల టికెట్ ఎంతండి?
బుకింగ్ క్లర్క్: పది రూపాయలు
ప్రేక్షకుడు: నాకు ఒక కన్నే ఉంది. అర టికెట్ ఇవ్వండి.
బుకింగ్ క్లర్క్: అలాగా? అయితే రెండో కన్ను పోయాక రా, ఫ్రీగా పంపిస్తాను.
----------------------------------------------------------------------
బోడిగుండు మీద కవితరాసి పంపండి. పదివేల రూపాయలు బహుమతి పొందండి’ అని ప్రకటించింది ఓ హాస్యపత్రిక.
అది చూసిన వెంటనే ఎడిటర్కు ఫోన్ చేసాడు రచయిత. ‘‘సార్! బోడిగుండు మీద కవిత రాయడం సాధ్యమే గాని గుండును పోస్టులో పంపడం ఎలా?’’ అని.

ముద్దాయిని కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి శిక్ష అమలు జరపాలన్నాడు జైలరు.
చివర్లో ‘‘నీ చివరి కోరిక ఏమిటి?’’ అడిగాడు జైలర్ ముద్దాయిని. ‘‘నాకు భయంగా వుంది. కరెంటు షాక్
ఇచ్చేటప్పుడు నన్ను గట్టిగా పట్టుకోండి సార్ చాలు’’ చెప్పాడు. ముద్దాయి.

భార్య:ఏవండీ లేవండి ఒళ్ళు తెలియకుండా ఏమిటీ ఆ మొద్దు నిద్ర?
భర్త: అబ్బబ్బ ! ఏమిటే నీ గొడవ? ఏం ముంచుకొచ్చిందని నా బంగారంలాంటి నిద్ర పాడు చేశావు?
భార్య: డాక్టరుగారిచ్చిన నిద్రమాత్రలు వేసుకోకుండానే పడుకుంటే ఎలాగండి?

తండ్రి: మీ క్లాసు మొత్తంలో బాగా కష్టపడే స్టూడెంట్ ఎవరు?
సుబ్బు: నేనే నాన్నగారు.
తండ్రి: అలా అని ఎందుకు అనిపిస్తుంది?
సుబ్బు: చాలా క్లాసుల్లో అందరూ కూర్చొని ఉంటే నేను మాత్రం బెంచి మీద నిల్చునే ఉంటాను.

సుబ్బారావు: అరే...నా ఆవును ఎవరో దొంగిలించారు...
అప్పారావు: వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్...
సుబ్బారావు: నాకు ఎలా ఫిర్యాదు చేయాలో తెలియదు
అప్పారావు: ‘రాత్రి చుక్కలు మెరుస్తున్న ప్పుడు కుక్కలు మొరుగుతున్నప్పుడు ఒక దొంగ మా గోడ దూకి ఆవును ఎత్తుకెళ్లాడు’ అని చెబితే చాలు.
సుబ్బారావు పోలీస్స్టేషన్కు వెళ్లాడు. కంగారు పడుతూ ఇలా అన్నాడు... ‘రాత్రి చుక్కలు మొరుగుతున్నప్పుడు
కుక్కలు మెరుస్తున్నప్పుడు ఒక దొంగ మా ఆవు మీది నుంచి దూకి గోడ ఎత్తుకు పోయాడు’.

సుబ్బారావు కొత్తగా జిరాక్స్ షాపు తెరిచాడు. తెలివిగా ఆలోచించి షాపు బయట ఓ బోర్డు పెట్టాడు...
‘‘ఇచ్చట తెలుగు, కన్నడ, మళయాళం, కన్నడం ఏ భాషలో ఉన్నా జిరాక్స్ తీయబడును.’’

వెంగళప్ప ఓ చెప్పుల దుకాణం తెరిచాడు. మెదటి రోజు నుంచే ఏదైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నాడు. వెంటనే ఒక ఐడియా వచ్చి...
‘‘ ఒక చెప్పు కొన్నవారికి మరొక చెప్పు ఉచితంగా ఇవ్వబడును అని బోర్డు పెట్టాడు’’.

పరంథామయ్య డాక్టర్ వద్ద మాలతి అనే నర్సు కొత్తగా జాయిన్ అయింది.
‘‘ఈ పేషెంట్ని పక్క థియేటర్కి తీసుకెళ్లు’’ అన్నాడు డాక్టర్.
‘‘ఏ పిక్చర్ రిలీజ్ అయ్యింది సార్ ఇవాళ’’ ఠక్కున అడిగింది నర్స్.

.jpg)
COMMENTS