పెళ్లికొడుకు సుబ్బన్న బైనాక్యూలర్ చూస్తున్నా డెందుకు? జ: తన దూరపు బంధువులు ఎవరో తెలుసు కుందామని! --------------------------------------...
పెళ్లికొడుకు సుబ్బన్న బైనాక్యూలర్ చూస్తున్నా డెందుకు?
జ: తన దూరపు బంధువులు ఎవరో తెలుసు కుందామని!
-----------------------------------------------------------------------------------
అంకయ్య, మంకయ్య ఈజిప్టియన్ మమ్మీలను చూడడం అదే మొదటిసారి...
అంకయ్య : చూడు ఎన్ని బ్యాండేజిలో! ఇది కచ్చితంగా యాక్సిడెంట్ కేస్!
మంకయ్య : అవునోయ్. ట్రాక్ నంబర్ కూడా వేశారు: బిసి-1760
-----------------------------------------------------------------------------------
ఒక పహిల్వాన్ సిటీ బస్సెక్కాడు.
కండెక్టర్ టికెట్ తీసుకొమ్మన్నాడు. పహిల్వాన్ కండలు చూపిస్తూ తీసుకోనన్నాడు. అమాయకుడైన కండక్టర్ భయంతో ఊరుకున్నాడు. అలా రెండోరోజు కూడా తీసుకోలేదు. మూడో రోజుకూడా తీసుకోకపోయే సరికి కండలు తిరిగి గూండాలా వున్నా బస్సు డ్రైవర్ సీట్లో నుంచి కోపంగా లేచిచొక్క మడుస్తూ పహిల్వా న్ దగ్గరికి వెళ్ళి ‘ఏం తమాషాగా వుందా? మర్యాదగా టికెట్ తీసుకో’అన్నాడు.
‘ఏం ఎందుకు తీసుకోవాలి... నాదగ్గర బస్ పాస్ వుంది కదా?’అన్నాడు పహిల్వాన్.
-----------------------------------------------------------------------------------
కలకత్తా నుండి ఢిల్లీకి విమానం వెళ్తోంది. కెప్టెన్ మైకులోంచి అనౌన్స్ చేశాడు. ‘‘విమానంలోని ఇంజన్ ఫైయిలైంది... అదృష్టవశాత్తూ విమానంలో ఇంకో రెండు స్పేర్ ఇంజన్లున్నాయి. రెండో దాంతో నడిపిస్తాను. మీరేం భయపడకండి.’’ కొంచెం సేపటికి మళ్ళీ మైకులోంచి కెప్టెన్ అనౌన్స్ చేశాడు. ‘‘విమానంలోని రెండో ఇంజన్ కూడా ఫెయిలైంది... మరేం పరవాలేదు. మూడో ఇంజన్తో నడిపిస్తాను...’’ ఇంతలో ఓ వెంగళప్ప పక్కనున్న వారితో అన్నాడు ‘‘ఇప్పుడు మూడో ఇంజన్ కూడా ఫెయిలైందనుకో... మనం ఇలా ఆకాశంలోనే ఉండిపోవాల్సుంటుందేమో’’
-----------------------------------------------------------------------------------
రోగి: డాక్టర్ గారూ! నేను ఏదో ఒక రోజున హఠాత్తుగా వచ్చి నా ప్యాంట్ జేబులోంచి డబ్బులు తీసి మీ పాత బాకీ మెత్తం తీర్చేశా ననుకోండి. మీరేమనుకుంటారు?
డాక్టర్: మీరు వేరెవరి ప్యాంటో వేసుకొచ్చారను కుంటాను.
-----------------------------------------------------------------------------------
ఇన్స్ పెక్టర్: దొంగను పట్టుకున్నావా?
కానిస్టేబుల్: పట్టుకోలేదు సార్...కానీ తగిన ఆధారం సంపాదించాను.
ఇన్స్ పెక్టర్: ఏమిటది?
కానిస్టేబుల్: వేలిముద్రలు సార్!
ఇన్స్ పెక్టర్: ఎక్కడ ఉన్నాయి అవి?
కానిస్టేబుల్: నా చెంప మీద సార్...
-----------------------------------------------------------------------------------
ఇంటికొచ్చిన తండ్రికి గుమ్మంలో ఆరేళ్ల కొడుకు సిగరెట్ తాగుతూ కనిపించాడు.
‘‘చూశావా నీ సుపుత్రుడు నోట్లో సిగరెట్ పెట్టుకొని అగ్గిపుల్ల గీయడానికి ప్రయత్నిస్తున్నాడు’’అని భార్యను కోప్పడ్డాడు.
‘‘అలాగా ఏడీ వాడు... ఇప్పుడే చెప్తాను వెధవకి... అగ్గిపుల్లతో ఆడుకునే వయసా వాడిది’’ అంది కోపంగా బయటికెళుతూ.
-----------------------------------------------------------------------------------
‘‘అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవైపు చూపించి వెళ్ళి పోతున్నాడు? ’’
‘‘ఓ.. అతనా! అతని పేరు ఏడుకొండలు. సోమవారం రోజున ఆయన మౌనవ్రతం లెండీ! మాట్లాడడు!’’
-----------------------------------------------------------------------------------
‘‘బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా!’’ అడిగారు టీచర్ స్టూడెంట్ని.‘‘బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా. అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది సార్! ’’ చెప్పాడు స్టూడెంట్.
-----------------------------------------------------------------------------------
‘‘మొన్న ఒక పత్రికలో మీ కథ చదివాను. నా కంటే మీరు చిన్నవారైనా అనుభవం మాత్రం పెద్దది’’ తోటి రచయితతో అన్నాడు సాటి రచయిత.
‘‘ఏం అలా అంటున్నారు?’’
‘‘ఏం లేదు. నేను ముప్ఫై సంవత్సరాల నాటి కథలు కాపీ కొడితే మీరు ఏభై సంవత్సరాల నాటి కథలు కాపీ కొడుతున్నారు. ’’
COMMENTS