వెంగళ్ అనబడే ఒక బ్రహ్మచారి భీషణ ప్రతిజ్ఞ: ‘నా జీవితంలో నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోను. నా పిల్లలకు కూడా చేయను’ ----------------------------...
వెంగళ్ అనబడే ఒక బ్రహ్మచారి భీషణ ప్రతిజ్ఞ:
‘నా జీవితంలో నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోను. నా పిల్లలకు కూడా చేయను’
------------------------------------------------------
మన తెలుగు సినిమా పేర్లతో రెండు వాక్యాలు రాయండి...(రెండు మార్కులు)
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అని ‘ ఒక్క మగాడు’ అన్నాడు.
‘ఆమె’ ‘ఢీ’ అంటే ‘అతడు’ ‘రెఢీ’ అన్నాడు.
---------------------------------------------------------
వెంగళ్ తన ఆటోకు ఉన్న ఒక చక్రాన్ని తీయడంలో తలమునకలై ఉన్నాడు. అప్పుడు ఎవరో వచ్చి-
‘ ఎందుకు చక్రాన్ని ఊడతీయాలనుకుంటున్నావు’ అని అడిగాడు.
సమాధానంగా వెంగళ్ ఒక బోర్డ్ చూపించాడు. దానిపై ఇలా ఉంది:
‘కేవలం టూవీలర్స్ మాత్రమే ఇచట పార్క్ చేయా లి’.
----------------------------------------------------------------------------------------
భార్య మూడ్ బాగుంటే-‘ మా ఆయన బంగారం’
భార్యకు కోపం వస్తే- ‘మా ఆయన కాకిబంగారం’

‘నిన్న తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లాను’ అన్నాడు శేఖర్ తన ఫ్రెండ్ అప్పారావుతో.
‘ ఓస్ ఆమాత్రం దానికే డాక్టర్ దగ్గరికి వెళ్లావా? నిన్ను నాకు తలనొప్పి వస్తే నా భార్యను రెండుసార్లు
గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. అంతే...తలనొప్పి మాయమైంది’ అన్నాడు అప్పారావు.
‘ ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదేం? ఈసారి తలనొప్పి వస్తే సరాసరి మీ ఇంటికి వస్తాను’ అన్నాడు సుబ్బారావు.

శ్రీమతి మంగతాయారు తన భర్తను చూస్తూ ఇలా పాడుతోంది....
‘మసి వదనా మసి వదనా కాకి కన్నుల మదనా’ అని ఎందుకు?
జవాబు: వాళ్ల ఆయన కారునలుపు

అంత్యక్రియలు నిర్వహించడానికి కొన్ని నిముషాల ముందుగా మృతదేహాన్ని ఫోటోతీన్తున్న ఫోటోగ్రాఫర్ను మృతుని బంధువులు చితక బాదారు. ఎందుకో తెలుసా?
ఫోటోగ్రాఫర్... స్మైల్ ప్లీజ్ అన్నాడు. స్మైల్ ప్లీజ్

ఇద్దరు మందు మారాజులు ఫుల్ గా తాగి నడిచి వెళ్తుండగా ఒకడు తూలి మురికి కాలువలో పడిపోయాడు. రెండోవాడు అతికష్టం మీద అతడిని బయటకు లాగాడు. మొదటివాడు ఒళ్ళంతా తుడుచుకుంటూ
‘‘ఒరేయ్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు భలే వాళ్ళురా. పగలు మురికి కాలువలను రోడ్డుప్రక్కన పెడతారు....
రాత్రయ్యేసరికి రోడ్డు మధ్యలోకిలాగుతారు’’ అన్నాడు.

ట్రైన్ కోసం గంటల కొద్ది ఫ్లాట్ ఫారం మీద వెయిట్ చేసి చేసి విసుగెత్తిన ఓ ప్రయాణికుడు స్టేషన్ మాస్టర్ మీద మండి పడ్డాడు. ‘‘ఏంట్సార్... ట్రైన్లు ఎప్పుడూ లేటుగా వస్తుంటాయి కదా... ఇంక ఈ టైంటేబుల్ చార్ట్ ఎందుకు అతికించడం దండగ.’’
‘‘బాబూ ఛార్టర్లో ఉన్న టైంకు ట్రైన్లు వస్తే లక్షలు పోసి కట్టించిన ఈ విశ్రాంతి గదుల్లో ఎవరు కూర్చుంటారు. వేస్టయిపోవూ’’ జవాబిచ్చాడు స్టేషన్ మాస్టర్.

‘‘నాలుగు నెలల క్రితం నీకు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తు జనాల్ని పీడిస్తున్నందుకు గాను రెండు నెలల జైలు శిక్ష విధించాను కదూ?’’ జడ్జి అడిగాడు బోన్లో వున్నతడ్ని.
‘‘అయ్యా గుర్తుంది’’
ఈ సారి మళ్ళీ నీమీద కేసు వచ్చింది. అయితే సాక్ష్యాలు సరిగా లేనందున నిన్ను నిర్దోషిగా భావించి విడుదల చేస్తున్నాను’’ అన్నాడు జడ్జీ.
‘‘సార్... అంత మాట అనకండి నాకు కనీసం ఒక్క వారమైన జైలు శిక్షవిధించండి..’’
‘‘ ఎందుకూ’’?
‘‘కొంత మంది ఖైధీలకు వడ్డీకి అప్పులి చ్చాను... అవి వసూలు చేసుకుని వెళ్ళిపోతాను...’’ అని జవాబిచ్చాడు బోన్లో ఉన్నతను.

భర్త బీరువాలో రహస్యంగా దాచిన ఒక బాక్స్ భార్యామణి కంటపడింది. అందులో మూడు రబ్బరు బంతులు, ఒక రూపాయల నోట్ల కట్ట కనిపించాయి. ఆఫీసు నుంచి భర్త వచ్చాక.. ‘ఏంటివి?’... అని నిలదీసింది.
‘ఓహ్... అవా... నీతో అబద్ధం చెప్పిన ప్రతిసారీ ఒక రబ్బరు బంతిని ఆ బాక్సులో దాచేవాడిని.. ’ అన్నాడు భర్త నవ్వుతూ. పెళ్లయిన 30 ఏళ్లలో భర్త మూడుసార్లే తప్పు చేశాడు కదా అని భార్యామణి సంతోషించి క్షమించేసింది.
‘మరి ఈ డబ్బు ఏమిటి?’
‘అదా... రబ్బరు బంతులు డజను కాగానే రూపాయికొకటి చొప్పున అమ్మేసే వాడిని..’ చెప్పాడు భర్త.

.jpg)
COMMENTS